
ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్న కైలే మేయర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కైలే మేయర్స్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ప్రత్యర్థుల బౌలింగ్‌లో బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. నిన్న చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 53 పరుగులు చేసి చెలరేగాడు.
మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేధనకు దిగిన లక్నో పవర్ ప్లేలోనే 80 పరుగులు చేసింది. ఇందులో మేయర్స్ 8ఫోర్లు, 2 సిక్సర్లను బాదాడు.
లక్నో విజయం దిశగా అడుగులు వేస్తుండగా.. మెయిన్ అలీ నాలుగు వికెట్ల తీసి చైన్నై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మేయర్స్
లక్నో జట్టుకు మేయర్స్ అదనపు బలం
మేయర్స్ తన మొదటి రెండు ఐపీఎల్ మ్యాచ్‌లలో 50 ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను తన ఐపీఎల్ అరంగేట్రంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 73 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్ తరఫున 24 టీ20లు ఆడిన మేయర్స్.. 135.77 స్ట్రైక్ రేట్‌తో 482 పరుగులు చేశాడు. అదే విధంగా బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు.
పవర్ ప్లేలో విజృంభిస్తున్న మేయర్స్.. ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు చేసినా రన్ రేట్‌ని తగ్గించడానికి కృషి చేస్తున్నాడు. అయితే లక్నో జట్టుకు మేయర్స్ అదనపు బలమని చెప్పొచ్చు.