Page Loader
Paris Olympics : గోల్డ్ ఆశలు గల్లంతు.. సెమీస్ లో లక్ష్యసేన్ ఓటమి
గోల్డ్ ఆశలు గల్లంతు.. లక్ష్యసేన్ ఓటమి

Paris Olympics : గోల్డ్ ఆశలు గల్లంతు.. సెమీస్ లో లక్ష్యసేన్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2024
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. సెమీస్ లో అక్సెల్‌సేన్ చేతిలో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యారు. తొలి సెట్‌లో అద్భుతంగా రాణించిన లక్ష్యసేన్ గేమ్ పాయింట్ వద్ద తడబడ్డాడు. దీంతో ప్రత్యర్థి అక్సెల్ సేన్ కు వరుస పాయింట్లు లభించాయి. ఇక మొదటి సెట్‌లో (22-20) తేడాతో లక్ష్యసేన్ వెనుకబడ్డాడు. రెండో సెట్లో వరుసగా ఏడు పాయింట్లు సాధించి మంచి జోరుమీదున్న లక్ష్యసేన్ ఆ తర్వాత నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ సెట్ కూడా 14-21 తేడాతో కోల్పోయి ఓడిపోయాడు