Page Loader
Virat Kohli: ఇంగ్లండ్‌తో చివరి వన్డే.. సంచలన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
ఇంగ్లండ్‌తో చివరి వన్డే.. సంచలన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

Virat Kohli: ఇంగ్లండ్‌తో చివరి వన్డే.. సంచలన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేలో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఆడే చివరి వన్డే ఇదే కావడంతో, ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Details

కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడా? 

కొంతకాలంగా కోహ్లీ తన సాధారణ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నాడు. అయితే తనకు ఇష్టమైన వన్డే క్రికెట్‌లో రాణించాలని భావిస్తున్నాడు. మోకాలి నొప్పితో నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి వన్డేకు దూరమైన కోహ్లీ, కటక్‌లో జరిగిన రెండో వన్డేలో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో కేవలం 8 బంతులు ఆడి 5 పరుగులకే అవుట్‌ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక మూడో వన్డేలో శతకం సాధించి, తన ఫామ్‌ను తిరిగి పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Details

ఊరిస్తున్న అరుదైన రికార్డు

ఇంగ్లాండ్‌తో మూడో వన్డే నేపథ్యంలో విరాట్ కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటి వరకు 296 వన్డేలు ఆడిన కోహ్లీ, 284 ఇన్నింగ్స్‌ల్లో 58 సగటుతో 13,911 పరుగులు చేశాడు. ఇందులో 50 శతకాలు, 72 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో వన్డేలో 89 పరుగులు చేస్తే వన్డేల్లో 14,000 పరుగుల మార్కును చేరుకుని అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన రికార్డు భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉంది. సచిన్‌ 350 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

Details

 వన్డేల్లో 14,000కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు 

ఇక కోహ్లీ మాత్రం ఈ మైలురాయిని 285వ ఇన్నింగ్స్‌లోనే అందుకోవడంతో, అత్యంత వేగంగా 14,000 పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. 1. సచిన్ టెండూల్కర్ (భారత్) - 18,426 పరుగులు 2. కుమార సంగక్కర (శ్రీలంక) - 14,234 పరుగులు