
పాకిస్థాన్‌ను వదిలేస్తున్నా.. ఐపీఎల్ ఆడటానికి సిద్ధం : మహ్మద్ అమీర్
ఈ వార్తాకథనం ఏంటి
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది ఆటగాళ్లను అంతర్జాతీయ మ్యాచులను ఆడే అవకాశం ఐపీఎల్ కల్పించింది.
ఈ ఐపీఎల్ లో అన్ని దేశాలు ప్లేయర్లు ఆడే అవకాశం ఉన్నా, పాకిస్థాన్ ప్లేయర్లు మాత్రం ఆడే ఛాన్స్ లేదు.
అయితే 2008లో జరిగిన తొలి సీజన్‌లో పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. అదే ఏడాది ముంబై దాడుల తర్వాత ఏ పాకిస్థాన్ ప్లేయర్లకు కూడా ఐపీఎల్‌లో అవకాశం ఇవ్వలేదు.
కానీ ఆ దేశానికి చెందిన మాజీ పేస్ బౌలర్ మహ్మద్ అమిర్ మాత్రం ఐపీఎల్‌లో ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Details
వచ్చే ఏడాది అమిర్ కి బ్రటిష్ పాస్ పోర్టు
మహ్మద్ అమిర్‌కి వచ్చే ఏడాది బ్రిటిష్ పాస్ పోర్టు వస్తోంది. దీంతో అతడు పాకిస్థాన్ పౌరుడు కాదు. అయితే బ్రిటన్ ప్లేయర్ గా ఐపీఎల్‌లో ఆడతారా అన్న ప్రశ్నకు అమీర్ స్పందించాడు. అవకాశం వస్తే కచ్చితంగా ఆడుతానని అని అతను చెప్పాడు.
తనకు ఇంకా ఏడాది సమయం ఉందని, భవిష్యతు గురించి ఎవరికి తెలియదని, తనకు పాస్ పోర్టు వచ్చిన తర్వాత దక్కే అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకుంటానని అమిర్ స్పష్టం చేశారు.
తాను ఇంగ్లండ్ తరుపున అంతర్జాతీయ మ్యాచులు ఆడనని, అల్లా కరుణిస్తే మళ్లీ పాకిస్థాన్ తరుపున ఆడతానని, కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడి, రాణించాలని అతను తెలిపాడు.