
George Foreman: ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్‌మాన్ ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్ (76) కన్నుమూశారు. శుక్రవారం ఆయన మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
"మా హృదయాలు ముక్కలయ్యాయి. తీవ్ర దిగ్బ్రాంతితో, మా ప్రియమైన జార్జ్ ఎడ్వర్డ్ ఫోర్‌మాన్ సీనియర్ ఇకలేరని ప్రకటిస్తున్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
1968 ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం గెలుచుకున్న ఫోర్‌మాన్, రెండుసార్లు హెవీ వెయిట్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. తన కెరీర్‌లో 68 నాకౌట్లలో పోటీ పడి, కేవలం ఐదు పోరులో మాత్రమే ఓటమిని చవిచూశారు.
1977లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, 1974లో మహమ్మద్ అలీతో జరిగిన పురస్కార పోరులో ఓటమి పాలయ్యారు.
Details
1990లో బాక్సర్ గా రీ ఎంట్రీ
ఆయన జీవితం అనేక మందికి ప్రేరణగా నిలిచింది. 1990లలో ఫోర్‌మాన్ మళ్లీ బాక్సింగ్‌కు రీ-ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.
గృహోపకరణ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ, సాల్టన్ ఇంక్ ద్వారా ఎలక్ట్రిక్ గ్రిల్‌ను ప్రచారం చేయడంలో తన ప్రత్యేకతను ప్రదర్శించారు.
ఆయన జీవిత ప్రయాణం కేవలం బాక్సింగ్ లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా అసాధారణమైనది.
జార్జ్ ఫోర్‌మాన్ ఒక గొప్ప బాక్సర్ మాత్రమే కాకుండా, స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కూడా. ఆయన అందించిన మార్గదర్శకత్వం, మానవతా సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.