
SRH Playoffs: 'ఆర్సీబీలా మేమూ ప్లేఆఫ్స్‌కు చేరతాం'.. నితీశ్ రెడ్డి ధీమా!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సీజన్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ వరుసగా పరాజయాలను చవిచూసి, ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించాయి.
అయితే గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి.
ముంబయి ఇండియన్స్ కూడా 10 పాయింట్లతో పుంజుకుని పోటీలోకి అడుగుపెట్టింది. ఈ నాలుగు టీమ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ -4లో కొనసాగుతున్నాయి.
Details
లక్నో సూపర్ జెయింట్స్ కూడా పోటీలో
10 పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో నిలిచి ఉంది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్రస్తుతం కేవలం మూడే విజయాలను సాధించి, ప్లేఆఫ్స్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఈ రెండు జట్లకు 5 మ్యాచులను గెలవడం మాత్రమే కాక, రన్‌రేట్‌ను కూడా మెరుగుపరచడం అవసరం.
సన్‌రైజర్స్ రన్‌రేట్ కోల్‌కతాకు కంటే తక్కువగా ఉండటంతో, వారి ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత తగ్గాయి.
అయినా, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం తన జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
Details
నితీశ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ''ఈ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యం.
దాని ప్రాముఖ్యతను డూ-ఆర్-డై మ్యాచ్ అని కూడా చెప్పవచ్చు. గత సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకూ ఇదే పరిస్థితి ఎదురైంది.
వారు వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకున్నారు. ఈ సారి మేము ఎందుకు ఆ దారిలోకి వెళ్లకూడదు?
తాము 100 శాతం ప్రదర్శన ఇవ్వాలని సంకల్పించామని చెప్పాడు. ప్రస్తుతం నితీశ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.