Cricket: క్రీడా ప్రదర్శనకు గుర్తింపుగా పోలీస్, ఆర్మీ పోస్టులు పొందిన క్రికెటర్ల జాబితా
క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారు పలుసార్లు ప్రభుత్వ గుర్తింపు పొందుతుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ప్రత్యేక గౌరవంతోపాటు ఉన్నత పదవులను అలంకరిస్తాయి. భారత క్రికెటర్లు ఈ గౌరవాలను అందుకున్నవారిలో ముందంజలో ఉన్నారు. పురుషులకే కాకుండా మహిళా క్రికెటర్లకూ ఇటువంటి గుర్తింపులు లభించాయి. ఇప్పుడు గౌరవ హోదాల్లో ఉన్న కొందరు భారత క్రికెటర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎంఎస్ ధోని భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా పొందారు. 2015లో ధోని పారాచూట్ రెజిమెంట్ శిక్షణ కూడా పూర్తిచేశారు. దేశం కోసం ఆయన చూపించిన నిబద్ధతకు ఇది ఒక గుర్తింపు.
మహ్మద్ సిరాజ్
2024 టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్‌ను నిలిపిన మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాతో గౌరవించింది. అద్భుతమైన క్రీడా ప్రదర్శనతో దేశానికి గౌరవం తీసుకువచ్చినందుకు ఈ గుర్తింపు లభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రస్తుత భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పంజాబ్ పోలీస్‌లో డిఎస్‌పి హోదాలో పనిచేస్తోంది. మహిళా క్రికెట్లో ఆమె చేసిన సేవలకు ఈ గౌరవం దక్కింది. హర్భజన్ సింగ్ భారత మాజీ లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పంజాబ్ పోలీస్‌లో డిఎస్‌పి హోదా పొందారు. అతని క్రీడా ప్రస్థానానికి ఇది ఒక గుర్తింపు అని చెప్పొచ్చు.
సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ఇం డియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ గౌరవ ర్యాంక్ పొందారు. క్రికెట్‌లో దేశం కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవంతో సత్కరించారు. జోగిందర్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆఖరి ఓవర్ వేసి చరిత్ర సృష్టించిన జోగిందర్ శర్మ, హరియాణా పోలీస్‌లో DSP హోదాలో కొనసాగుతున్నారు. కపిల్ దేవ్ భారత జట్టు మాజీ కెప్టెన్, 1983 ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా పొందారు. సైనిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కపిల్, దేశ సేవలోనూ తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఇలా భారత క్రికెటర్లు క్రీడతోపాటు దేశ సేవలో నిబద్ధత చూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలవడం విశేషం.