లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీకి యూపి వారియర్జ్‌గా నామకరణం చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీ యజమానులైన కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 757 కోట్లను పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న జోన్ లూయిస్ ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు. ఫ్రాంచైజీకి అంజు జైన్, లిసా స్తాలేకర్, యాష్లే నోఫ్కేలు వివిధ హోదాల్లో సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నారు. భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజు సహాయ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మహిళల క్రికెట్‌కు ఎంతో తోడ్పాటునందిస్తుందని, ఇందులో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని లూయిస్ అన్నారు.
మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4 నుండి 26 వరకు ముంబైలో జరగనున్నారు. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 13 న ప్రారంభం కానుంది. అదానీ గ్రూప్ అహ్మదాబాద్ ఆధారిత ఫ్రాంచైజీని రూ. 1,289 కోట్లు, ముంబైకి చెందిన జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 912.99 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం బెంగళూరుకు చెందిన జట్టును రూ. 901 కోట్లు, ఢిల్లీకి చెందిన జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ. 810 కోట్లను పెట్టుబడులు పెట్టాయి. మహిళల ఐపీఎల్ మీడియా హక్కులకు 951 కోట్లకు Viacom18 గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో WPL ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మహిళల క్రికెట్ పోటీగా నిలిచింది.