
LSG Vs RR: రాజస్థాన్ రాయల్స్ పై 2పరుగుల తేడాతో లక్నో ఘన విజయం..
ఈ వార్తాకథనం ఏంటి
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.
కేవలం రెండు పరుగుల తేడాతో విజయాన్నిఅందుకున్న లక్నో,మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మలచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
టాపార్డర్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆశించిన విధంగా రాణించకపోయినా,ఐదేన్ మార్కరమ్ అద్భుతంగా ఆడి 66 పరుగులు చేయగా, ఆయుష్ బదోని అర్ధ సెంచరీతో 50 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు.
చివరి దశలో డెవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 30 పరుగులతో మెరిశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు ఐదు వికెట్లు కోల్పోయి మొత్తం 180 పరుగులు నమోదు చేసింది.
వివరాలు
బ్యాటింగ్‌లో జైస్వాల్ అద్భుతంగా ఆడి 74 పరుగులు
రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగంలో హసరంగ మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థికి చెక్ పెట్టగా, జోఫ్రా ఆర్చర్,సందీప్ శర్మ,దేశ్‌పాండే ఒక్కొక్క వికెట్ చొప్పున తీసి బౌలింగ్‌లో సహకరించారు.
181 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌లో జైస్వాల్ అద్భుతంగా ఆడి 74 పరుగులు సాధించాడు.
అలాగే సూర్యవంశీ 34 పరుగులు,రియాన్ పరాగ్ 39 పరుగులు చేసి పోరాడినా విజయం మాత్రం అందుకోలేకపోయారు.
రాజస్థాన్ జట్టు కూడా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది.
లక్నో బౌలింగ్ విభాగంలో శార్దూల్ ఠాకూర్,మార్కరమ్ తలో వికెట్ పడగొట్టగా, ఆవేన్ ఖాన్ రెండు కీలక వికెట్లు తీసి విజయానికి దోహదం చేశాడు.