
Lucknow Super Giants: ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు చెత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది.
బెంగళూరులోని మ్యాచ్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో జట్టు 227 పరుగులు చేసినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
భారీ స్కోరు చేసినా గెలుపు దూరంగా ఉండటం లక్నో బౌలింగ్ దళం పరిపక్వత లేనిదనడానికి నిదర్శనం. ఈ విజయంతో ఆర్సీబీ క్వాలిఫయర్-1కు దూసుకెళ్లింది.
అయితే అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Details
లక్నో సూపర్ జెయింట్స్ చరిత్రాత్మక పరాజయం
ఈ మ్యాచ్‌లో లక్నో ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేసింది.
కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుత శతకం నమోదు చేస్తూ 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ ఈ భారీ స్కోరును తమ బౌలింగ్ ద్వారా కాపాడటంలో జట్టు పూర్తిగా విఫలమైంది.
ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది.
Details
ఐపీఎల్‌లో చెత్త రికార్డు
ఈ సీజన్‌లో లక్నో జట్టు మూడుసార్లు 200 కంటే ఎక్కువ స్కోరు చేసినప్పటికీ మూడుసార్లూ ఓటమిపాలవడం గమనార్హం. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ప్రత్యేకమైన చెత్త రికార్డు.
200 పరుగులు దాటిన మ్యాచుల్లో మూడు పరాజయాలను ఎదుర్కొన్న మొదటి జట్టుగా లక్నో నిలిచింది.