Page Loader
LSG vs GT: గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ విక్టరీ
గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ విక్టరీ

LSG vs GT: గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ విక్టరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
07:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (60; 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), సాయి సుదర్శన్ (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలు బాదారు. లక్ష్య చేధనలో లక్నో జట్లు 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సునాయాసంగా చేధించింది.

Details

విజృంభించిన నికోలస్ పూరన్

అడమ్ మర్క్రమ్ (58: 31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) నికోలస్ పూరన్ (61: 34 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు) రాణించి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రసిద్ధ కృష్ణ రెండు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు. గుజరాత్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (16; 14 బంతుల్లో 2 ఫోర్లు), రూథర్‌ఫోర్డ్ (22; 19 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశారు. షారుక్ ఖాన్ (11), రషీద్ ఖాన్‌ (4) నాటౌట్‌గా నిలిచారు.

Details

రాణించిన లక్నో బ్యాటర్లు

లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, శార్దూల్ ఠాకూర్ 2, దిగ్వేశ్‌ రాఠీ, అవేశ్‌ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్ లో 6 బంతుల్లో 6 పరుగులు లక్నో జట్టుకు అవసరం కాగా సాయి కిషోర్ బౌలింగ్ చేశాడు. మొదటి బంతిని అబ్దుల్ సమద్ సింగ్ తీశాడు. తర్వాతి రెండు, మూడు బంతుల్లో అయిష్ బదోని బౌండరీ బాదడంతో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్నో విజయం సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆరు వికెట్ల తేడాతో లక్నో విజయం