David Reddy: 'డేవిడ్ రెడ్డి' మూవీ నుంచి షాకింగ్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత మనోజ్ పూర్తి స్థాయి హీరోగా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి రూపొందిస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్రానికి ముందు జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఓ ధైర్యవంతుడైన యోధుడి జీవిత కథను ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
మూవీలో యువ హీరో..
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు 'డేవిడ్ రెడ్డి' చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్ర కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ యువ హీరోను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సమయంలో వచ్చే ఈ పాత్ర కథలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
వివరాలు
సీక్రెట్‌గా షూటింగ్..
సాధారణ గెస్ట్ రోల్‌లా కాకుండా, క్లైమాక్స్‌లో చోటుచేసుకునే హై-ఎనర్జీ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం ఆ యువ హీరో పాత్ర చుట్టూనే సాగుతుందట. మంచు మనోజ్‌తో కలిసి బ్రిటిష్ సైన్యంపై పోరాడే సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించే స్థాయిలో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ సర్‌ప్రైజ్ రోల్‌లో కనిపించబోయే యువ హీరో ఎవరు అన్న విషయాన్ని మాత్రం చిత్రబృందం ఇప్పటివరకు గోప్యంగానే ఉంచింది.