Page Loader
Labuschange : సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అరుదైన రికార్డును సాధించిన మార్నస్‌ లబుషేన్‌ 
సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అరుదైన రికార్డును సాధించిన మార్నస్‌ లబుషేన్‌

Labuschange : సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అరుదైన రికార్డును సాధించిన మార్నస్‌ లబుషేన్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2023
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు వరుస విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లబుషేన్ చరిత్రకెక్కాడు. తొలి వన్డేలో గ్రీన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో అతని స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబుషేన్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. 93 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Details

కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన లబుషేన్

ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్‌‌లో ఏ క్రికెటర్ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి 80 పరుగులు చేయలేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి రికార్డును మరొకటి గతంలోనూ లబుషేన్ పేరిటే ఉండడం విశేషం. 2019లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచులో లబుషేన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి 50 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్లేయర్ల తలకు బలమైన గాయమైతే అతని సామర్థ్యానికి సరిపడే ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా ఆడించడమే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌.