Page Loader
Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త!
నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త!

Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో ఒకటి నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న క్వాలిఫయర్-2. ఇందులో పంజాబ్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు పంజాబ్ కింగ్స్‌కు మంచి వార్త అందింది. గాయంతో కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు మరియు క్వాలిఫయర్-1 పోరులో గాయ కారణంగా చాహల్ అందుబాటులో లేకపోయాడు. అతని గైర్హాజరీతో పంజాబ్ స్పిన్ విభాగం బలహీనంగా మారిన విషయం తెలిసిందే.

Details

పూర్తి ఫిట్ నెస్ సాధించడం చాహల్

అయితే తాజా సమాచారం ప్రకారం చాహల్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి జట్టుతో కలిసి నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. బౌలింగ్ ప్రాక్టీస్‌తో పాటు కెచింగ్ డ్రిల్స్‌లో చురుగ్గా పాల్గొన్న చాహల్ తిరిగి మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలిబుచ్చాడు. అతను పాల్గొనడం పంజాబ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 34 ఏళ్ల చాహల్ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే అతని ఇకానమీ రేట్ 9.56గా ఉంది.

Details

చైన్నై సూపర్ కింగ్స్ పై హ్యాట్రిక్ రికార్డు

ముఖ్యంగా చైన్నై సూపర్ కింగ్స్‌పై హ్యాట్రిక్‌ సాధించి తన ఫామ్‌ను మెరిపించాడు. పంజాబ్ కింగ్స్‌ 2025 వేలంలో చాహల్‌ను రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తక్కువ పరుగుల్లో నిలుపుతూ వికెట్లు తీయగల ముఖ్య బౌలర్‌గా చాహల్‌ నిలిచాడు. మొత్తానికి ఈరోజు జరిగే కీలక క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో చాహల్‌ పూర్తిగా ఫిట్‌గా ఉంటే, అతను ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.