Page Loader
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు ఎలా జరుగుతాయంటే?
అక్టోబర్ 5న వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు ఎలా జరుగుతాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2023
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12తో తొలి దశ మ్యాచులు ముగియనున్నాయి. నవంబర్ 15 సెమీఫైనల్ 1, నవంబర్ 16న సెమీఫైనల్ 2 మ్యాచ్ జరగనుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియనుంది. తొలిదశ జరిగే మ్యాచులన్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటారు. అంటే ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. తొలి దశ ముగింపు సమయానికి టాప్-4లో ఉండే నాలుగు జట్లే సెమీస్‌కు చేరనున్నాయి. ఈ రెండు మ్యాచుల్లో విజేతలు అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు.

Details

టీమిండియా తలపడే జట్ల వివరాలు ఇవే

భారత్ వార్మప్‌ మ్యాచ్‌లు.. సెప్టెంబర్‌ 30: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (గౌహతి) అక్టోబర్‌ 3: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-1 (తిరువనంతపురం) భారత్‌‌ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్‌ 8: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్‌ 11: ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (ఢిల్లీ) అక్టోబర్‌ 15: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ (అహ్మదాబాద్‌) అక్టోబర్‌ 19: ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (పూణే) అక్టోబర్‌ 22: ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ (ధర్మశాల) అక్టోబర్‌ 29: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (లక్నో) నవంబర్‌ 2: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-2 (ముంబై) నవంబర్‌ 5: ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్‌ 11: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-1 (బెంగళూరు)