2011లో సచిన్ కోసం వరల్డ్ కప్ సాధించాం.. ఈసారి ఆ ప్లేయర్ కోసం కప్పు గెలవాలి : సెహ్వాగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచ కప్ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి.
ఇక సొంతగడ్డపై బరిలోకి దిగుతున్న టీమిండియాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత ఆటగాళ్లకు కీలక సూచన చేశాడు.
ఈసారి భారత జట్టు విరాట్ కోహ్లీ కోసం వరల్డ్ కప్ సాధించాలని అన్నాడు. అప్పట్లో వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచి సచిన్ టెండుల్కర్ కు కానుకగా ఇచ్చామని గుర్తు చేశారు.
Details
కోహ్లీకి వన్డే వరల్డ్ కప్ ని కానుకగా ఇవ్వాలి
తాము 2011 ప్రపంచ కప్ సచిన్ టెండుల్కర్ కోసం ఆడి, అతనికి ట్రోఫీని కానుకగా ఇచ్చామని, అప్పుడు జట్టులో సచిన్ ఉంటే, ఇప్పుడు కోహ్లీ ఉన్నాడని, ఈసారి టీమిండియా జట్టు కోహ్లీ కోసం ఆడాలని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు.
వన్డే ప్రపంచ కప్ 2023ని కోహ్లీకి బహుమతిగా అందించాలని, ప్రతి ఒక్కరూ అదే లక్ష్యంగా ఆడాలని, ఈసారి వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ 100శాతం కష్టపడతాడని అతను అశాభావం వ్యక్తం చేశారు.
2013లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ ఛాంపియన్ ట్రోఫీ నెగ్గింది. అప్పటి నుంచి ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా టీమిండియా గెలవలేదు. త్వరలో సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్ ను ఎలాగైనా గెలవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది.