
పాకిస్థాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐసీసీ .. పీసీబీ డిమాండ్‌కు వ్యతిరేకం!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరోసారి ఐసీసీ షాకిచ్చింది. ఈ వరల్డ్ కప్‌లో తాము ఆడే రెండు మ్యాచుల వేదికలు మార్చాలని పీసీబీ డిమాండ్ చేసింది.
అయితే ఈ అభ్యర్థనకు ఐసీసీ కరాఖండిగా నో చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై పీసీబీ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ డ్రాప్ట్ ను బీసీసీఐ తయారు చేసి, ఐసీసీకి పంపింది. దీనిపై అభిప్రాయాలను తెలపాలని ఇప్పటికే ఐసీసీ సభ్యదేశాలను కోరింది.
ఈ షెడ్యూల్‌లో చెపాక్ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్, చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ రెండు వేదికలపై పాక్ ఆసంతృప్తిగా ఉంది.
Details
వేదికలు మార్చడానికి నో ఛాన్స్
చైన్నైలోని చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్లను ఈ పిచ్ పై ఎదుర్కోవడానికి పీసీబీ జంకుతున్నట్లు సమాచారం.
బిగ్ హిట్లర్లున్న ఆస్ట్రేలియాతో చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి కూడా పీసీబీ ఆలోచిస్తోదంట.
అయితే అప్ఘనిస్తాన్‌తో మ్యాచును బెంగళూరులో, ఆసీస్ తో మ్యాచ్‌ను చైన్నైలో నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరింది.
నిబంధన ప్రకారం వేదికలు మార్చే హక్కు ఆతిథ్య దేశానికే ఉంటుంది. సరైన కారణం లేకుండా వేదికలు మార్చడానికి వీలు ఉండదు.
ఏవైనా భద్రతా కారణాలు ఉంటేనే వేదికలు మార్చే ఛాన్స్ ఉంటుంది. వేదికలు మార్చడానికి సరైన కారణం లేకపోవడంతో పీసీబీ డిమాండ్ ను ఐసీసీ, బీసీసీఐ కొట్టిపారేశాయి.