ఆసియా కప్ విషయంలో పాక్ మళ్లీ లొల్లి.. కాబోయే పీసీబీ చైర్మన్ హాట్ కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ - 2023 వివాదం ఓ కొలిక్కి వచ్చిందని అనుకున్న తరుణంలో అభిమానులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.
నిన్నటి వరకూ చర్చలు జరిపి ఆఖరికి పీసీబీ ప్రాతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌నే ఆమోదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు కొత్త పీసీబీ ఛీప్ ఝలక్ ఇచ్చాడు. హైబ్రిడ్ మోడల్ తనకు నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సౌథీ పదవీ కాలం జూన్ 21తో ముగియనుంది. కొన్ని రోజుల్లోనే పీసీబీకి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ బలపరిచిన జకా అష్రఫ్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నాడు.
ఆసియా కప్ టోర్నీ విషయంలో పాకిస్థాన్ కు చాలా అన్యాయం జరిగిందని జకా అష్రఫ్ పేర్కొన్నారు.
Details
హైబ్రిడ్ మోడల్ ను వ్యతిరేకించిన కొత్త అధ్యక్షుడు
తాను హైబ్రిడ్ మోడల్‌ను గతంలో వ్యతిరేకించానని, ఇది అర్థం పర్థం లేని విధానమని, ఐసీసీ ఈ ఏడాది ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించేటట్టు నిర్ణయించిందని దాని ప్రకారమే ఇక్కడ టోర్నీ జరగాలని, కేవలం నేపాల్ వంటి దేశాలే పాక్‌లో ఆడడం చాలా అన్యాయమని జకా అష్రఫ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆసియా కప్ జరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ టీమిండియా లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం ఆసాధ్యం.
ఇటీవల ఏసీసీ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచులు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచులు ఆడేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ అభిమానుల్లో అందోళన మొదలైంది.