LOADING...
Glenn Maxwell: కపిల్ దేవ్ ఇన్నింగ్స్‌ను మ్యాక్స్ వెల్ గుర్తు చేశాడు : రవిశాస్త్రి
కపిల్ దేవ్ ఇన్నింగ్స్‌ను మ్యాక్స్ వెల్ గుర్తు చేశాడు : రవిశాస్త్రి

Glenn Maxwell: కపిల్ దేవ్ ఇన్నింగ్స్‌ను మ్యాక్స్ వెల్ గుర్తు చేశాడు : రవిశాస్త్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2023
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో నిన్న పెద్ద సంచలనమే చోటు చేసుకుంది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల జరిగిన మ్యాచులో ఆసీస్ ఓడిపోయే మ్యాచులో అనూహ్యంగా గెలుపొందింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడుతూ ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. అతనకొన్కడే 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి 8వ వికెట్‌కు 202 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి వరల్డ్ కప్ చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మ్యాక్స్ వెల్ ఆడిన ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Details

ఆసీస్ తరుపున డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా మ్యాక్స్ వెల్

మాక్స్ వెల్ అద్భుతమైన ప్రదర్శన తనకు కపిల్ దేవ్ 1983 ప్రదర్శన గుర్తు చేసిందని టీమిండియా మాజీ కోచ్, కామెంటర్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఇక 1975లో టీమిండియా, జింబాబ్వే‌తో ఆడిన మ్యాచులో 78 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. భారత్‌కు ఓటమి ఖాయమనుకున్న దశలో కపిల్ దేవ్ 175 పరుగులు చేసి టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. మాక్స్‌వెల్ ఈ డబుల్ సెంచరీతో వన్డేల్లో 6 నెంబర్ లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా తరుపున డబుల్ సెంచరీ చేసిన మొదటి ప్లేయర్‌గా మ్యాక్స్ వెల్ సరికొత్త రికార్డును సృష్టించాడు.