Glenn Maxwell: టీ20ల్లో మాక్స్‌వెల్ సరికొత్త చరిత్ర.. రోహిత్ ఆల్ టైం రికార్డు సమం
ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) క్రీజులో ఉంటే ఏ జరుగుతుందో అందరికీ తెలిసిందే. కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడి ఒంటిచేత్తో మ్యాచును గెలిపిస్తాడు. ఫాస్ట్, స్పిన్ తేడా లేకుండా గ్రౌండ్‌లో నలువైపులా షాట్స్ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తాడు. ఇటీవల వన్డే వరల్డ్ కప్ ఆఫ్గాన్‌పై డబుల్ సెంచరీ బాదినా మ్యాక్సీ, తాజాగా భారత్ పై టీ20లో అదే మ్యాజిక్ ను రిపీట్ చేశాడు. టీమిండియా పై కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేసి టీ20ల్లో మాక్స్ వెల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
2016లోనే శ్రీలంకపై తొలి శతకాన్ని బాదిన టీ20
టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును మ్యాక్సీ సమం చేశాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్‌లో 4 సెంచరీలు చేస్తే.. మాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్ లోనే 4 సెంచరీలు చేశాడు. బాబర్ అజామ్, సబావూన్ డేవిజీ, కోలిన్ మున్రో, సూర్యకుమార్ యాదవ్ తలా మూడు సెంచరీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. మ్యాక్స్‌వెల్ తన కెరీర్‌లో 2016లో శ్రీలంకపై తొలి టీ20 సెంచరీని బాదాడు. టీ20 క్రికెట్‌లో 50 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో మూడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ మ్యాక్స్‌వెల్‌గా రికార్డుకెక్కాడు.