
Mayank Agarwal: హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్ అగర్వాల్.. పోలీసులకు ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఓపెనర్,కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మంగళవారం అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కాడు.
ఫ్లైట్‌లో తాను కూర్చున్న సీటు ముందున్న పౌచ్‌లో ఉన్న ద్రవాన్ని తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు.
దింతో అతడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఐఎల్ఎస్ హాస్పిటల్‌కి కి తరలించారు. ఈ సంఘటన క్రికెట్ వర్గాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాగా ఆసుపత్రి నుంచి తన మేనేజర్ సహాయంతో మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.
మయాంక్ విమానంలో అతని ముందు ఉన్న పౌచ్ లో ఉన్న ద్రవాన్ని కొంచెం తాగాడు. దింతో అతనికి అకస్మాత్తుగా గొంతులో వాపు, బొబ్బలు వచ్చి మాట్లాడలేకపోయాడు.
Details
నిలకడగా మయాంక్ ఆరోగ్యం
ILS హాస్పిటల్ తరపున,బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ మనోజ్ కుమార్ దేబ్‌నాథ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ,క్రికెటర్ నోటి పూతతో బాటు,గొంతులో వాపు, బొబ్బలుతో బాధపడ్తున్నాడని పేర్కొన్నాడు.
జనవరి 30న హాస్పిటల్‌లో చేరాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
భారత్ తరఫున 21 టెస్టులు ఆడిన అగర్వాల్ నేతృత్వంలోని కర్ణాటక సోమవారం త్రిపురపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే, అగర్వాల్ సూరత్‌లో రైల్వేస్‌తో తదుపరి రంజీ ట్రోఫీ గేమ్ ఆడడు.అతడి స్థానంలో మనీష్ పాండే ఆడనున్నాడు.
నికిన్ జోస్ తదుపరి మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మయాంక్ క్లీనింగ్ రసాయనం తాగి ఉండవచ్చని, దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు.