Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ గతంలో చెప్పినట్లుగా, పాకిస్థాన్‌కు భారత క్రికెట్ జట్టు వెళ్లడం లేదని స్పష్టం చేసింది. భద్రతా కారణాల వల్ల, ఐసీసీకి బీసీసీఐ ఈ నిర్ణయం తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది, కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దీనికి నిరాకరించిందని తెలుస్తోంది.
ఐసీసీ సమావేశం వాయిదా?
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ,''బీసీసీఐ ఇప్పటికే తమ నిర్ణయాన్నిప్రకటించింది.అక్కడి భద్రతా పరిస్థితులు అనుకూలంగా లేనట్లుగా భావించి,జట్టును పంపకపోవాలని నిర్ణయించింది.ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని,భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం సాధ్యమయ్యే అవకాశం లేదు''అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణకు సంబంధించి ఐసీసీ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 4గంటలకు సమావేశం జరగాల్సి ఉంది.అయితే,ఆ సమావేశం రేపటికి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. అధికారికప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించకపోతే,ఆర్థిక పరంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పెద్దనష్టం సంభవించవచ్చు. అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం,క్రికెట్ ప్రముఖులు ఈ మోడల్‌కు సహమతం కావడంలో పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.