Page Loader
Hasin Jahan: మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్,ఆమె కూతురు పై హత్యాయత్నం కేసు నమోదు
మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్,ఆమె కూతురు పై హత్యాయత్నం కేసు నమోదు

Hasin Jahan: మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్,ఆమె కూతురు పై హత్యాయత్నం కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
07:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్ భూమ్ జిల్లా సూరి ప్రాంతంలో జరిగిన ఓ ఘటన కారణంగా ఈ కేసు నమోదైంది. హసిన్ జహాన్ పక్కింటి వ్యక్తిపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో హసిన్ జహాన్ తో పాటు ఆమె మొదటి భర్తతో కలిగిన కుమార్తె అర్షి జహాన్ పై కూడా బీఎన్ఎస్ సెక్షన్ కింద హత్యాయత్నం, దాడి, ఇతర నేరాల ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

హసిన్ జహాన్ కు నెలకు రూ. 4 లక్షల భరణం

ఇక మరోవైపు, హసిన్ జహాన్ కు నెలకు రూ. 4 లక్షల భరణం చెల్లించాలని ఇటీవల కలకత్తా హైకోర్టు మహ్మద్ షమీకి ఆదేశాలు జారీ చేసింది. షమీ ఆర్థిక స్థితిగతులను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఇందులో హసిన్ జహాన్ కు నెలకు రూ. 1.5 లక్షలు, కూతురు భరణంగా రూ. 2.5 లక్షలు చెల్లించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..