తదుపరి వార్తా కథనం

BCCI: అభిమానులతో పాటు బీసీసీఐకి భారత సీనియర్ ఫాస్ట్‌బౌలర్ క్షమాపణలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 28, 2024
11:22 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశానికి చెందిన సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ, తన అభిమానులనూ, బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు.
సరైన సమయానికి తన ఫిట్‌నెస్‌ను సాధించి ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధం అవ్వలేకపోతునందుకు మన్నించాలని కోరాడు.
క్రితం సంవత్సరం వన్డే ప్రపంచకప్ తర్వాత, షమి గాయంతో ఆటకు దూరమయ్యాడు.
అయితే, ఏడాది గడిచినా అతను పూర్తిగా ఫిట్‌గా ఉండకపోవడం వల్ల ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులోకి ఎంపిక అవ్వలేదు.
వివరాలు
షమీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
''రోజూ నా బౌలింగ్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఈ విషయంలో మరింత కష్టపడుతాను. త్వరలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడాలని ఉద్దేశిస్తున్నాను. అభిమానులకు, బీసీసీఐకి నా క్షమాపణలు. నేను వీలైనంత త్వరగా టెస్టు క్రికెట్‌కు సిద్ధమవుతాను'' అని షమి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు.