Mohammed Shami: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. దిగ్గజాల రికార్డు బద్దలు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ప్రత్యర్థుల బ్యాటర్లకు మహ్మద్ షమీ చెమటలు పట్టించాడు. నిన్ని జరిగిన మ్యాచులో 5 ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో షమీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరుఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ చరిత్రకెక్కాడు. ఈ మెగా టోర్నీలో షమీ ఇప్పటివరకూ 45 వికెట్లను తీశాడు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్ దిగ్గజాలు జహీర్ ఖాన్, జవగాల్ శ్రీనాథ్ ను షమీ అధిగమించాడు. వీరిద్దరూ వన్డే వరల్డ్ కప్‌లో సంయుక్తంగా 44 వికెట్లను పడగొట్టారు.
మిచెల్ స్కార్ట్ రికార్డును సమం చేసిన షమీ
అదే విధంగా షమీ ఇప్పటివరకూ వరల్డ్ కప్‌లో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్కార్క్(3) రికార్డును సమం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో వీరిద్దరూ మాత్రమే మూడుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశారు. ఇక షాహీన్ అఫ్రిది, ముస్తాఫిజర్ రెహ్మన్, షాహిద్ అఫ్రిది, గ్లెన్ మెక్‌గ్రాత్ రెండుసార్లు చొప్పున ఐదు వికెట్లను పడగొట్టారు. ఈ టోర్నీలో షమీ కేవలం 14 మ్యాచ్‌లలో 45 వికెట్లను తీశాడు.