Page Loader
మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు గ్రూప్-1 పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు గ్రూప్-1 పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు గ్రూప్-1 పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2024
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ గ్రూప్-1 క్యాడర్‌లో డీఎస్పీ ఉద్యోగాలు అనౌన్స్ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల టీ20 వరల్డ్ సాధించిన జట్టులో మహ్మద్ సిరాజ్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఆయనకు గ్రూప్-1 పోస్టు ఇవ్వనున్నట్లు తెలిసింది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. మరోవైపు బాక్సర్ నిఖత్ జరీన్ గతంలో రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది.

Details

ఒలింపిక్స్ లో నిరాశపరిచన నిఖత్ జరీన్

బాక్సర్ నిఖత్ జరీన్ 2022, 2023లో రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ బంగారు పతకాలను సాధించింది. అయినా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఆమెను నియమించడంలో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ఫ్రీ క్వార్టర్స్‌లో చైనా బాక్సర్ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది.