Loading...
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్‌షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
యశస్వితో రిలేషన్‌షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?

Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్‌షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య డేటింగ్ జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసేలా మృణాల్ ఠాకూర్ పేరుతో ఓ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వైరల్ కామెంట్ నిజంగా మృణాల్ చేసిందేనా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు

అవన్నీ ఊహాగానాలే..

కొంతకాలం క్రితం మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ ముంబైలోని ఓ కేఫ్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపించారు.

ఇద్దరూ ఒకేసారి బయటకు వచ్చినప్పటికీ, వేర్వేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

వివరాలు

ఆమె కామెంట్ వైరల్..

ఈ నేపథ్యంలో యశస్వితో తన సంబంధంపై మృణాల్ స్పందించారంటూ ఓ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అందులో పుకార్లను నమ్మవద్దని, ఇలాంటి విషయాలపై వీడియోలు చేయడం కంటే సరైన అంశాలపై దృష్టి పెట్టాలని మృణాల్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ వీడియోలో కనిపించడం లేదు.

దీంతో ఆ వ్యాఖ్య నిజంగా మృణాల్ చేసినదేనా లేదా అనేది స్పష్టంగా నిర్ధారించలేని పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT