Page Loader
రాంచీ వీధుల్లో లగ్జరీ కారుతో ఎంఎస్ ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్ 
రాంచీ వీధుల్లో లగ్జరీ కారుతో ఎంఎస్ ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్

రాంచీ వీధుల్లో లగ్జరీ కారుతో ఎంఎస్ ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2023
06:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా ఆయన క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తనకు ఇష్టమైన కారులో రాంచీ వీధుల్లో ధోనీ లాంగ్ డ్రైవ్ చేస్తుంటాడు. ధోనీ కారు, బైక్ కలెక్షన్‌కు సంబంధించిన వీడియోను ఇటీవలే మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబంతో కలిసి రాంచీలోని తన ఫామ్ లో ధోనీ ఆనందంగా గడుపుతున్నాడు.

Details

1980 నాటి మోడల్ కారును డ్రైవ్ చేసిన ఎంఎస్ ధోనీ

తాజాగా ఓ వింటేజ్ కారును డ్రైవ్ చేస్తూ ధోనీ కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనీ స్టైల్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 1980 నాటి మోడ‌ల్ బ్లూ క‌ల‌ర్ రోల్స్ రాయిస్ కారులో ఎంఎస్ ధోనీ ప్ర‌యాణిస్తుండ‌గా బైక్ పై వెళుతున్న ఓ వ్య‌క్తి వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇటీవ‌లే మోకాలికి ధోనీ స‌ర్జ‌రీ చేయించుకున్న విషయం తెలిసిందే.