MS Dhoni Captain: IPL ఆల్-టైమ్ గ్రేటెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా MS ధోని ఎంపిక
మాజీ భారత కెప్టెన్,చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లెజెండ్ ఎంఎస్ ధోని ఆల్-టైమ్ గ్రేటెస్ట్ IPL జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్‌లతో కూడిన సెలక్షన్ ప్యానెల్, 70 మంది జర్నలిస్టుల ఇన్‌పుట్‌తో పాటు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఖరారు చేసింది. ఐపీఎల్ టోర్నీలో 5 టైటిల్స్ అందించిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్ ద్వయంలో ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్, భారతదేశం రన్-మెషిన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.
మూడవ స్థానంలో క్రిస్ గేల్
క్రిస్ గేల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన మూడవ స్థానాన్ని ఆక్రమించాడు. మిడిల్ ఆర్డర్‌లో ధోనీతో పాటు, సురేష్ రైనా, ఎబి డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఆల్ రౌండర్ స్లాట్‌లను హార్దిక్ పాండ్యా,రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్ భర్తీ చేసింది. స్పిన్ విభాగానికి రషీద్ ఖాన్, సునీల్ నరైన్,యుజ్వేంద్ర చాహల్ త్రయం నాయకత్వం వహిస్తుండగా, లసిత్ మలింగ,జస్ప్రీత్ బుమ్రాలు పేస్ కోటాలో జట్టులో చోటు దక్కించుకున్నారు. 2024 ఫిబ్రవరి 20 నాటికి ఐపీఎల్ 16 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గౌరవించబడిన ధోని నాయకత్వ పరాక్రమం అతని అద్భుతమైన కెరీర్‌కు మూలస్తంభంగా నిలిచింది.
ధోనీకి మద్దతును తెలిపిన మాథ్యూ హేడెన్
'స్టార్ స్పోర్ట్స్ ఇన్‌క్రెడిబుల్ 16 ఆఫ్ IPL' షోలో, దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ధోని నాయకత్వ నైపుణ్యానికి ప్రతిరూపమని కొనియాడాడు, వివిధ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడంలో అతని అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ను ఉదహరించాడు. టామ్ మూడీ, మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్,కోచ్,విభిన్న ప్రతిభావంతులను విజయపథంలో నడిపించే అతని సామర్థ్యాన్ని నొక్కిచెబుతూ స్టార్-స్టడెడ్, యావరేజ్ స్క్వాడ్‌లతో టైటిళ్లను సాధించడంలో ధోని అద్భుతమైన ఫీట్‌ని వివరించాడు. మరో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కెప్టెన్‌గా,కోచ్‌గా ధోనీకి తన మద్దతును తెలిపాడు. ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ స్క్వాడ్: ఎంఎస్ ధోని (కెప్టెన్),విరాట్ కోహ్లీ,క్రిస్ గేల్,డేవిడ్ వార్నర్,సురేశ్ రైనా,ఏబీ డివిలియర్స్,సూర్యకుమార్ యాదవ్,హార్దిక్ పాండ్యా,రవీంద్ర జడేజా,కీరన్ పొలార్డ్,రషీద్ ఖాన్,సునీల్ నరైన్,యుజ్వేంద్ర చాహల్,లసిత్ మలింగ,జస్ప్రీత్ బుమ్రా.