
MS Dhoni: ధోనీకి బీసీసీఐ స్పెషల్ ఆఫర్..! గంభీర్ రియాక్షన్ ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఎంఎస్ ధోని భారత క్రికెట్‌కి అనేక ఘన విజయాలను అందించిన సారథి. రెండు ప్రపంచ కప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీతో దేశాన్ని గర్వంగా నిలిపిన ధోనీ, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. తన మాయాజాలంతో ఇంకా అభిమానులను అక్కటుకుంటూ, క్రికెట్ ప్రియుల మనసుల్లో ప్రత్యేక స్థానం పొందాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, ధోనీ ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. వచ్చే సీజన్‌లో మళ్లీ మైదానంలో కనిపిస్తాడా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
వివరాలు
దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించడానికి ధోనీని మెంటార్‌గా..
ఈ క్రమంలో ధోనీకి భారత క్రికెట్ బోర్డు (BCCI) ప్రత్యేక ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. 2021లో టీ20 ప్రపంచ కప్ సమయంలో బీసీసీఐ ధోనీని కేవలం ఆ టోర్నీ కోసం మెంటార్‌గా నియమించింది. ఆ తర్వాత అతడికి ఎలాంటి ప్రత్యేక బాధ్యతలు అప్పగించలేదు. ఈసారి, బీసీసీఐ దీన్ని షార్ట్-టర్మ్ మాత్రమే కాకుండా, భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించడానికి ధోనీని మెంటార్‌గా కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు, మాజీ కెప్టెన్ ఈ ఆఫర్‌ను అంగీకరిస్తాడా లేదా అనేది అభిమానులు, విశ్లేషకుల మనసులో ఆసక్తికరంగా మారింది.
వివరాలు
ప్రధాన కోచ్ ఏమంటాడో?
ప్రస్తుతం టీమ్‌ఇండియాకు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ధోనీని మెంటార్‌గా కొనసాగించడం విషయంలో గంభీర్ సానుకూలంగా ఉండకపోవచ్చని కొందరు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ధోనీ నాయకత్వంలో గెలిచిన వన్డే, టీ20 ప్రపంచకప్ జట్లలో గంభీర్ కూడా సభ్యుడుగా ఉన్నాడు. అప్పుడు క్రెడిట్ అంతా సారథిగా ధోనీకి ఇవ్వడం సరికాదంటూ ఆ తర్వాత చాలా సందర్భాల్లో గంభీర్ వ్యాఖ్యానించాడు. జట్టు కలసి ఆడినప్పుడు మాత్రమే విజయాలు సాధ్యమని నమ్మే గంభీర్, ధోనీ వంటి లెజెండరీ క్రికెటర్‌ను తన కంటే పైస్థాయిలో ఉంచడంలో ఇష్టపడతాడా అనే ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలా మారింది.