IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు.. సూర్యకుమార్‌కు జట్టు పగ్గాలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ముంబయి ఇండియన్స్ (MI) ఇప్పటి వరకు 5 టైటిళ్లు సాధించింది.
ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ హయాంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన ఈ జట్టు, ఐపీఎల్ 2024 కోసం కొత్త నాయకత్వాన్ని ఎంచుకుంది.
ఆల్‌రౌండర్ హార్దిక్ పండ్యాను కెప్టెన్‌గా నియమించడంతో జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉండడం లేదు
Details
తొలి మ్యాచులో సీఎస్కే తో తలపడనున్న ముంబై
మార్చి 23న ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది.
స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘన కారణంగా హార్దిక్ పండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు.
ఐపీఎల్ 2024 చివరి మ్యాచ్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నిబంధనను అతిక్రమించడంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం తొలి మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Details
హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్!
ముంబైలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా హార్దిక్ పండ్యా ఈ అంశంపై స్పందించాడు. తన స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నట్లు వెల్లడించాడు.
అంతకుముందు భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన సూర్య, జట్టును విజయపథంలో నడిపించే అనుభవం కలిగిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది.