Page Loader
రిచర్డ్ సన్ స్థానంలో మరో పేస్ బౌలర్‌ను ఎంచుకున్న ముంబై ఇండియన్స్
జో రిచర్డ్ సన్ స్థానంలో ఎంపికైన రీల్ మెరిడిత్

రిచర్డ్ సన్ స్థానంలో మరో పేస్ బౌలర్‌ను ఎంచుకున్న ముంబై ఇండియన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2023
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్ సన్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయ్యాడు. గత కొంతకాలంగా అతను మోకాలి గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో రిచర్డ్ సన్ పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఈ మెగా టోర్న నుంచి తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో మరో ఆసీస్ పేసర్ రీల్ మెరిడిత్ ను ముంబై భర్తీ చేసింది. రూ. 1.5 కోట్లకు మెరెడిత్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

ముంబై ఇండియన్స్

ఏప్రిల్ 8న సీఎస్కే‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్

ఆస్ట్రేలియా తరుపున 5 టీ20లు ఆడిన మెరిడిత్ 8 వికెట్లను పడగొట్టాడు. మెరిడిత్ 2021లో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశారు. ఐపీఎల్ 13 మ్యాచ్ లు ఆడిన మెరిడిత్ 12 వికెట్లను పడగొట్టాడు. గత రెండు సీజన్ లకు ముంబై తరుపున ఆడిన మెరిడిత్‌ని.. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు ముంబై విడిచిపెట్టింది. ఇక ముంబై ఇండియన్స తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 8న సీఎస్కే‌తో తలపడనుంది.