LOADING...
MI vs RR: రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు..ముంబయి చేతిలో చిత్తు
రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు..ముంబయి చేతిలో చిత్తు

MI vs RR: రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు..ముంబయి చేతిలో చిత్తు

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
11:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు అధికారికంగా ముగిశాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ తో తలపడ్డ రాజస్థాన్ జట్టు 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముంబయి ఇన్నింగ్స్‌లో నిర్దేశించిన భారీ లక్ష్యమైన 218 పరుగుల చేధనకు రాజస్థాన్‌ జట్టు బరిలోకి దిగింది. అయితే వారి ఇన్నింగ్స్‌ 16.1 ఓవర్లలోనే 117 పరుగుల వద్ద కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్‌ 30 పరుగులతో కొంత ప్రయాస పట్టినప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ మెరుగైన ప్రదర్శన చూపలేకపోయారు.

వివరాలు 

ఖాతా తెరవని వైభవ్ సూర్యవంశీ, హెట్‌మయర్‌

యశస్వి జైస్వాల్‌ 13, రియాన్ పరాగ్ 16, నితీష్ రాణా 9 పరుగులతో ఔటయ్యారు. ఇక వైభవ్ సూర్యవంశీ, హెట్‌మయర్‌ ఇద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు , దీపక్ చాహర్‌, హార్థిక్‌ పాండ్యా చెరో వికెట్‌ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబయి చేతిలో చిత్తైన రాజస్థాన్