
ENG vs IND: మాంచెస్టర్‌లో తప్పక గెలవాలి.. భారత జట్టు ముందు ఉన్న సవాళ్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ పర్యటనలో మూడో టెస్టుతో అసలైన ఉత్కంఠ మొదలైంది. టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టులో భావోద్వేగాలు కలిపిన సిరీస్ ఉద్వేగభరిత దశకు చేరుకుంది. మ్యాచ్‌కు పరాజయం చవిచూసిన భారత్ ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో జట్టుకు ఎదురవుతున్న కీలక అంశాలను విశ్లేషిద్దాం.
Details
తుది జట్టుపై మేనేజ్‌మెంట్ నిర్ణయం కీలకం
ముఖ్యంగా కరుణ్ నాయర్ నిలకడలేని ప్రదర్శనపై టీమ్ మేనేజ్‌మెంట్ పునరాలోచన అవసరం. దేశవాళీ క్రికెట్‌లో ఆకట్టుకున్నాడన్న కారణంతో ఎంపికైన ఆయన, మూడు టెస్టుల్లోనూ ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. ఇదే సమయంలో సాయి సుదర్శన్‌ను ఒకే మ్యాచ్ తర్వాత పక్కన పెట్టడం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరుణ్‌పై వేటు ఖాయం అన్న చర్చలు జోరుగా ఉన్నాయి.
Details
టెయిలెండర్లపై దృష్టి అవసరం
మూడో టెస్టులో టీమిండియా ఓటమికి కారణమైన ప్రధాన అంశాల్లో ఒకటి ఇంగ్లాండ్ టెయిలెండర్లు అద్భుతంగా ఆడడమే. జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ 84 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌పై ఒత్తిడి పెంచారు. లోయర్ ఆర్డర్‌ను విరిచేయడంలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఈ భాగస్వామ్యాలు ముందే చెదిపి ఉంటే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదన్నది మాజీల విశ్లేషణ.
Details
రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడిని అధిగమించాలి
భారత బ్యాటింగ్‌లో మరో ప్రధాన సమస్య రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడికి లోనవడమే. మొదటి ఇన్నింగ్స్‌లో సాఫీగా ఆడిన బ్యాటర్లు, రెండో ఇన్నింగ్స్‌లో తడబాటుకు గురవుతున్నారు. మూడో టెస్టులోనూ ఇదే జరిగింది. పంత్ గాయం, గిల్ తప్పిదం కీలకంగా నిలిచాయి. మేనేజ్‌మెంట్ అతన్ని ఐదో రోజు లేట్‌గా బ్యాటింగ్‌కు పంపించి ఉంటే, స్వింగ్ తగ్గి ఉండేది, ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Details
మాటల యుద్ధానికి సమర్థంగా సమాధానం ఇవ్వాలి
లార్డ్స్ టెస్టులో భారత్ లక్ష్య ఛేదనలో దిగినప్పటినుంచి ఇంగ్లండ్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ మోత పెరిగింది. కార్స్, బెన్ స్టోక్స్ మాటల యుద్ధంతో మొదలైన ఈ పర్వం, పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, జడేజాలపై వ్యక్తిగత వ్యాఖ్యల వరకు వెళ్లింది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ లాంటి నాయకుడు ఉన్నట్లయితే పరిస్థితిని తడబడకుండా సమర్థంగా ఎదుర్కోగలిగేవాడని అభిమానులు భావిస్తున్నారు. జట్టు నాయకత్వం ఈ విషయంలో గిల్స్ సేన మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
Details
అదనపు పరుగులే అడ్డంకిగా మారాయి
మూడో టెస్టులో భారత్ పరాజయ తేడా కేవలం 22 పరుగులే. కానీ ఈ తేడా అదనపు పరుగుల రూపంలోనే ఏర్పడింది. భారత్ ఇచ్చిన ఎక్స్‌ట్రాలు మొత్తం 63గా ఉండగా, ఇంగ్లాండ్ కేవలం 30 మాత్రమే ఇచ్చింది. బైస్ రూపంలో టీమిండియా బౌలర్లు 36 పరుగులు ఇచ్చిన విషయం గమనార్హం.