చిరకాలం గుర్తిండిపోయే రికార్డుకు చేరువలో నాథన్ లియోన్
యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నేడు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ కు చిరకాలం గుర్తిండిపోయే రికార్డుకు దగ్గరయ్యాడు. కేవలం ఈ మ్యాచ్ ఆడడం ద్వారానే అతను ఈ చరిత్రను సృష్టించనున్నాడు. టెస్టు క్రికెట్లో వరుసగా 100 మ్యాచులు ఆడిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనతను సంపాదించనున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ ఇతర బౌలర్ ఈ ఫీట్ ను సాధించకపోవడం గమనార్హం. ఓవరాల్ గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ వరుసగా 159 టెస్టు మ్యాచులు ఆడి ముందు వరుసలో ఉన్నాడు.
500 వికెట్లకు చేరువలో నాథన్ లియోన్
అలిస్టర్ కుక్ తర్వాత ఆసీస్ ఆల్‌రౌండర్ అలెన్ బోర్డర్ (153), ఆసీస్ మార్క్ వా (107), టీమిండియా నుంచి గవాస్కర్ వరుసగా 106 మ్యాచులు ఆడాడు.వీరందరి తర్వాతి స్థానంలో లియోన్ ఉన్నారు. నాథన్ లియోన్ తన కెరీర్ లో మొత్తం 121 టెస్టు మ్యాచులను ఆడాడు. ఇందులో 23 సార్లు ఐదు వికెట్లు, నాలుగు సార్లు పది వికెట్ల ను తీసి మొత్తంగా 495 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టులో లయోన్ మరో 5 వికెట్లు పడగొడితే 500 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డుకెక్కనున్నాడు.