Page Loader
నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్.. ప్రత్యేక ఆకర్షణగా మురళీ
నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్ ప్రారంభం

నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్.. ప్రత్యేక ఆకర్షణగా మురళీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2023
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కు సమయం అసన్నమైంది. ఈ ఏడాది ఆసియా క్రీడలకు అర్హత సాధించేందుకు భారత అథ్లెట్లకు ఇదే చివరి అవకాశం కావడం గమనార్హం. ఈ పోటీలకు దూరంగా ఉన్న వాళ్లను ఆసియా క్రీడల ఎంపిక పరిగణలోకి తీసుకోమని ఇప్పటికే భారత అథ్లెటిక్స్ సమాఖ్య స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆరంభమయ్యే ఈ ఛాంపియన్ షిప్‌‌ను అథ్లెట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గాయం కారణంగా ఈ పోటీలకు నీరజ్ చోప్రా, అవినాష్ దూరమయ్యారు. గత వారం పారిస్ డైమండ్ లీగ్‌లో మొట్టమొదటి సారి మూడోస్థానం సాధించిన లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ ఈ పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

Details

చైనాలో ఆసియా క్రీడలు ప్రారంభం

గతేడాది కామన్వెల్త్ క్రీడల హైజంప్ లో కాంస్యం నెగ్గిన తేజస్విన్ శంకర్ ప్రస్తుతం డెకథ్లాన్ లో పోటీపడనున్నాడు. అమ్లాన్‌ (200మీ.పరుగు), తజిందర్‌ పాల్‌ (షాట్‌పుట్‌), ప్రవీణ్‌ చిత్రవేల్‌, ఎల్దోస్‌ పాల్‌ (ట్రిపుల్‌ జంప్‌) పై భారీ ఆశలు ఉన్నాయి. ఇక మహిళల్లో ఏపీ అమ్మాయి జ్యోతి యర్రాజిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 100 మీటర్ల పరుగు, 110మీ. హార్డిల్స్‌లో ఆమె సత్తాచాటేందుకు సిద్ధమైంది. మహిళల లాంగ్‌ జంప్‌లో భారత్‌ నుంచి రెండో అత్యుత్తమ ప్రదర్శన (6.76మీ) అందుకున్న 19 ఏళ్ల షైలి సింగ్‌ ఏ విధంగా రాణిస్తుందో వేచిచూడాలి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 23న చైనాలో ఆసియా క్రీడలు ఆరంభమవుతాయి.