LOADING...
Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ
90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ

Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జావెలిన్‌ స్టార్ నీరజ్‌ చోప్రా ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్‌ లీగ్‌ 2025 జావెలిన్‌ త్రో పోటీల్లో పాల్గొన్న నీరజ్‌ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కొత్త రికార్డును నెలకొల్పాడు. తన మూడవ ప్రయత్నంలో అతడు బల్లెన్ని 90.23 మీటర్ల దూరానికి విసిరి తొలిసారిగా 90 మీటర్ల మార్కును అధిగమించాడు. అయితే, ఈ అద్భుత ప్రదర్శనతోనూ అతడికి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జర్మనీకి చెందిన జులియన్ వెబర్‌ చివరి ప్రయత్నంలో 91.06 మీటర్ల దూరం త్రో చేసి విజేతగా నిలిచాడు. ఇంతకుముందు నీరజ్‌ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు కాగా, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు.

Details

భారతదేశం గర్విస్తోంది : మోదీ

అదే దూరంతో 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక 2023లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 88.17 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు. 90 మీటర్ల మైలురాయిని అధిగమించడం అతడి కెరీర్‌లో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా నీరజ్‌ను అభినందించారు. "అద్భుతమైన ఫీట్! దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించిన నీరజ్‌ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత కృషి, అంకితభావం, క్రమశిక్షణ ఫలితమే. ఈ ప్రదర్శనతో భారతదేశం గర్విస్తోందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్‌ చేశారు.