Page Loader
NEPAL-MON: ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత మోగించిన నేపాల్
ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత మోగించిన నేపాల్

NEPAL-MON: ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత మోగించిన నేపాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2023
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా గేమ్స్ లో పురుషుల నేపాల్ జట్టు రికార్డుల మోత మోగించింది. నేపాల్-మంగోలియా జట్ల మధ్య జరిగిన మ్యాచులో నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈనేపథ్యంలో నాలుగు అంతర్జాతీయ రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ టీ20ల్లో చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచులో నేపాల్ 273 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత నేపాల్ 314 పరుగులు చేయగా, మంగోలియా కేవలం 41 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచుల్లో బద్దలైన రికార్డుల గురించి తెలుసుకుందాం. నేపాల్ బ్యాటర్ దీపేంద్రసింగ్ ఐరీ 10 బంతుల్లో 52 నాటౌట్‌గా నిలిచి అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని సాధించిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఇక దీపేంద్ర సింగ్ 9 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేశాడు.

Details

టీ20ల్లో 300 పరుగులు చేసిన మొదటి జట్టుగా నేపాల్

టీ20ల్లో 300 పరుగులు చేసిన మొదటి జట్టుగా నేపాల్ అవతరించింది. మరోవైపు కుశాల్ మలలా అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. కేవలం 34 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశారు. ఇప్పటివరకూ ఈ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో) పేరిట ఉంది. ఈ మ్యాచులో దీపేంద్ర సింగ్ స్ట్రైక్ రైట్ 520 గా ఉండడం విశేషం. 2014లో టీ20 హోదాను సాధించిన నేపాల్, కొన్ని నెలలకే అప్గానిస్థాన్ మీద సంచలన విజయం సాధించి, తన పేరు మార్మోగేలా చేసింది.