ఒమన్‌పై నెదర్లాండ్స్ విజయం
వరల్డ్ క్యాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచులో నెదర్లాండ్స్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 362 పరుగుల చేసింది. విక్రమ్‌జీత్ సింగ్ 109 బంతుల్లో (11ఫోర్లు, 2 సిక్సర్లు) 110 పరుగులు, బారేసి 65 బంతుల్లో (10 ఫోర్లు, 3 సిక్సర్లు) 97 పరుగులు చేయడంతో నెదర్లాండ్ భారీ స్కోరును చేయగలిగింది. ఈ క్రమంలో బారేసి 3 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బాస్ డి లీడ్ కూడా వేగంగా 39 పరుగులను రాబట్టాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ (3/75), నదీమ్ (2/36) ఆకట్టుకున్నారు
సెంచరీతో చెలరేగిన అయాన్ ఖాన్
మ్యాచుకు వర్షం అడ్డురావడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321గా నిర్ణయించగా.. ఒమన్ 6 వికెట్ల నష్టానికి 246 పరుగులే చేసింది. ఒమన్ జట్టులో అయాన్ ఖాన్ సెంచరీతో చేలరేగాడు. కేవలం 92 బంతుల్లోనే (11 ఫోర్లు, 2 సిక్సర్లు) 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని షోయాబ్ ఖాన్ (46) చక్కటి సహకారం అందించాడు. నెదర్లాండ్ బౌలర్లలో ఆర్యన్ దత్ 3 వికెట్లు, ర్యాన్ క్లీన్ వికెట్లు తీసి ఒమన్‌ను దెబ్బ తీశారు. ఇప్పటికే శ్రీలంక ప్రపంచ కప్‌కు అర్హత సాధించగా, మంగళవారం స్కాంట్లాండ్‌పై జింబాబ్వే నెగ్గితే ఆ జట్టుకు రెండో బెర్తు ఖరారు అవుతుంది.