CWC Qualifiers: 213 పరుగులకే చాప చుట్టేసిన శ్రీలంక.. నెదర్లాండ్స్ బౌలర్ల విజృంభణ
జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డేవరల్డ్ కప్ క్యాలిఫైయర్ లీగ్ మ్యాచులు ముగిశాయి. దీంతో సూపర్ సిక్స్ కు ఆరు జట్లు అర్హత సాధించాయి. అయితే సూపర్ సిక్స్ క్వాలిఫైయర్ 2 మ్యాచులో నెదర్లాండ్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 213 పరుగులకే ఆలౌటైంది. నెదర్లాండ్స్ పేసర్లు బాస్ డీ లీడ్, వాన్ బీక్ విజృంభించడంతో శ్రీలంక బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. వాన్ బీక్ అద్భుతంగా బౌలింగ్ చేసి పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక (2), సదీర సమరవిక్రమ (1)ను ఔట్ చేసి సత్తా చాటాడు. డి లీడ్ బౌలింగ్ లో హసరంగా(20), తీక్షణ(28), లహిరు కుమార(2) ఔట్ కావడంతో శ్రీలంక స్వల్ప స్కోరునే చేయగలిగింది.
నెదర్లాండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డి లీడ్
రైట్ ఆర్మ్ పేసర్ వాన్ బీక్ 22 వన్డేలలో 5.31 ఎకానమీ వద్ద 31 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో అతను తొమ్మిది వికెట్లు తీశాడు. ఈ టోర్నమెంట్ లో నెదర్లాండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డి లీడ్ నిలిచాడు. అతను 28 వన్డేల్లో 6.07 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా బ్యాటింగ్‌తో 562 వన్డే పరుగులు చేశాడు. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ లీగ్ మ్యాచులో వరుసగా గెలిచి సత్తా చాటిన శ్రీలంక, సూపర్ సిక్స్ టోర్నీలో మాత్రం చేతులెత్తేసింది.