Page Loader
Rohit Sharama: రోహిత్ శర్మ హుందాతనం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)
రోహిత్ శర్మ హుందాతనం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)

Rohit Sharama: రోహిత్ శర్మ హుందాతనం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

వాంఖడే మైదానం 50 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, డయానా ఎడుల్జీ తదితరులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. సునీల్ గవాస్కర్ తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ వేడుకలో పాల్గొన్నాడు. రోహిత్ శర్మ ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఒక సీనియర్ క్రికెటర్‌ పట్ల చూపించిన అనుభావపూర్వక వైఖరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Details

గత వారం రోజులుగా వార్షికోత్సావాలు

'రోహిత్.. నువ్వు సూపర్' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వాంఖడే మైదానం వార్షికోత్సవాలు గత వారం రోజులుగా ముంబయిలో జరుపుకుంటున్నాయి. ఆదివారం ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ఎంసీఏ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. సభా వేదికపై సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, డయానా ఎడుల్జీ, రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు హాజరై కుర్చీలపై కూర్చున్నారు. అదే సమయంలో వేదికకు రోహిత్ శర్మ చేరుకున్నాడు. రవిశాస్త్రి రోహిత్‌ను తన పక్కన ఉన్న సీట్లో కూర్చోవాలని సూచించాడు. అయితే రోహిత్, మధ్యలో ఖాళీగా ఉన్న రెండు కుర్చీలను చూపిస్తూ, రవిశాస్త్రిని అక్కడ కూర్చోమని ఆహ్వానించారు. రవిశాస్త్రిని మధ్యలో కూర్చోబెట్టి, ఆ పక్కనే రోహిత్ కూర్చొని మర్యాదపూర్వకంగా వ్యవహరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Details

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్ ట్రోఫీ

టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత వాంఖడే మైదానంలో భారీగా జరిపిన సంబరాలు అందరికీ గుర్తుండే అంశం. రోహిత్ శర్మ, ఈ ఏడాది భారత్ కోసం మరో ట్రోఫీ గెలవాలని ఉత్సాహంగా ఉన్నాడు. మా జట్టు వెనక 140 కోట్ల మంది అభిమానుల మద్దతు ఉంటుందని, విజేతగా నిలవడమే తమ లక్ష్యమని రోహిత్ చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీని మళ్లీ వాంఖడేకు తీసుకొస్తామనే నమ్మకంతో ఉన్నామని రోహిత్ ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. చివరిసారిగా 2013లో ధోనీ నేతృత్వంలో భారత్ టైటిల్ గెలుచుకుంది. ఈ వన్డే కెరీర్ చివరి ఐసీసీ ట్రోఫీగా భావిస్తున్న రోహిత్, గొప్ప వీడ్కోలు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో