LOADING...
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త జట్టు ఎంట్రీకి రంగం సిద్ధం!
ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త జట్టు ఎంట్రీకి రంగం సిద్ధం!

New IPL Team: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త జట్టు ఎంట్రీకి రంగం సిద్ధం!

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
09:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌తో కొత్త సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ ప్రభావం ఇప్పుడు ఐపీఎల్ భవిష్యత్తుపై కూడా కనిపిస్తోంది. అతని స్వరాష్ట్రం బిహార్‌కు ప్రత్యేకంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఉండాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఓ ప్రముఖ బిలియనీర్ మద్దతు తెలపడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వివరాలు

బీహార్ జట్టుపై బిలియనీర్ ఆసక్తి..

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే 53 సిక్సర్లు బాదిన అతని ప్రదర్శన విశేషంగా నిలిచింది. బిహార్ నుంచి ఇంతటి ప్రతిభ వెలుగులోకి రావడంతో కార్పొరేట్ వర్గాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. వైభవ్ ఆటతీరును ప్రశంసించిన ఓ ప్రముఖ బిలియనీర్.. "బిహార్‌కు కూడా ఐపీఎల్‌లో సొంత జట్టు ఉంటే ఎంతో బాగుంటుంది" అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు, భవిష్యత్తులో బిహార్ కేంద్రంగా కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

పాట్నా నుంచి ఐపీఎల్ జట్టు?

ప్రస్తుతం ఐపీఎల్‌లో 10 జట్లు పోటీపడుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 12కు పెంచే అవకాశాలపై బీసీసీఐ పరిశీలన చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ అదే అమలైతే, పట్నా కేంద్రంగా బిహార్ జట్టు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైభవ్ సూర్యవంశీ క్రేజ్‌తో బిహార్‌లో క్రికెట్‌పై ఆసక్తి భారీగా పెరిగింది. దీంతో అక్కడి మార్కెట్ విలువ కూడా గణనీయంగా పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు

అభిమానుల్లో భారీ ఉత్సాహం..

బీహార్‌కు ఐపీఎల్ జట్టు వచ్చే అవకాశంపై అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఒకవేళ బిలియనీర్ ముందుకొచ్చి ఫ్రాంచైజీని నిజం చేస్తే.. స్థానిక యువ ఆటగాళ్లకు పెద్ద ఎత్తున అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారీ అభిమాన గణం కలిగిన జట్లలో బిహార్ టీమ్ కూడా ఒకటిగా నిలవొచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 'వైభవ్ ఎఫెక్ట్' దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా.. ఇది భవిష్యత్తులో ఐపీఎల్‌ను మరింత విస్తరించే దిశగా తీసుకెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement