KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్‌కి నూతన కెప్టెన్.. కేఎల్ రాహుల్ నిర్ణయం షాకింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.
దాదాపు అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇప్పటివరకు తమ సారథిని ప్రకటించలేదు.
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు మెగా వేలం తర్వాత నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.
అక్షర్ పటేల్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోగా, కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు నాయకత్వం వహించాడు. వీరిద్దరిలో ఎవరిని ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
Details
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేఎల్ రాహుల్
అయితే, తాజా సమాచారం మేరకు కెప్టెన్సీ రేసు నుంచి కేఎల్ రాహుల్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఐపీఎల్ 2025 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యే అవకాశాలు బలపడినట్లు తెలుస్తోంది.
కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని కోరినా, అతడు ఓ బ్యాటర్‌గా జట్టుకు సహాయపడాలని భావిస్తున్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు ఐఎఎన్‌ఎస్‌కు తెలిపాయి.
2019 నుంచి అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ అతడిని రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఇప్పటివరకు అక్షర్ 150 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 130.88 స్ట్రైక్‌రేటుతో 1653 పరుగులు చేశాడు. 7.28 ఎకానమీతో 123 వికెట్లు తీసుకున్నాడు.
Details
రూ.14 కోట్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ
మరోవైపు, కేఎల్ రాహుల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఇది తొలి సీజన్.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ అతడిని రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇప్పటివరకు 132 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రాహుల్ 45.5 సగటుతో 134.6 స్ట్రైక్‌రేటుతో 4683 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు, 37 అర్ధశతకాలు ఉన్నాయి.