Jay Shah: 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఉన్నత అధికారులతో భేటీ అయ్యిన ఐసీసీ ఛైర్మన్ జే షా
ఒలింపిక్స్ క్రీడల్లో మళ్లీ క్రికెట్‌కు చోటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 128 సంవత్సరాల తర్వాత, జెంటిల్మెన్ ఆట ఒలింపిక్స్‌లో తిరిగి చేరిపోతుంది. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే క్రీడల్లో క్రికెట్ ఆడనున్నారు. అయితే, 2032లో బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అవకాశం కల్పించే అంశంపై ఇవాళ చర్చ జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా నియమితుడైన ఐసీసీ చైర్మన్ జే షా పాల్గొన్నారు. బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. సమ్మర్ క్రీడల్లో ఒలింపిక్స్‌ను జోడించాలా లేదా అన్న అంశంపై చర్చ జరిగింది. లాస్ ఏంజిల్స్ క్రీడలకు అంగీకారం ఇచ్చినా, బ్రిస్బేన్ క్రీడలకు సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కూడా జే షా త్వరలో ప్రకటన
అయితే ఈ రోజు బ్రిస్బేన్ అధికారులతో జరిగిన చర్చకు సంబంధించిన వీడియోను జే షా తన ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ సమావేశంలో బ్రిస్బేన్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ సిండీ హుక్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హక్లే కూడా పాల్గొన్నారు. శనివారం నుంచి ఆస్ట్రేలియాతో గబ్బా స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌ను జే షా వీక్షించనున్నారు. అలాగే, ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కూడా జే షా త్వరలో ప్రకటన చేయాల్సి ఉంది. హైబ్రిడ్ మోడల్‌కు సభ్య దేశాలు అంగీకరించినప్పటికీ, తుది ప్రకటన ఇంకా వెలువడలేదు.