New Zealand: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. క్రైస్ట్‌చర్చ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టుకు మూడు పాయింట్ల కోత విధించబడినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)మంగళవారం వెల్లడించింది. పాయింట్ల కోతతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా కూడా విధించబడింది. ఈ శిక్ష న్యూజిలాండ్ జట్టుకు మాత్రమే కాకుండా ఇంగ్లాండ్‌కు కూడా వర్తిస్తుంది. దీంతో న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 47.92శాతం పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. ఫైనల్ రేసులో నిలవాలంటే,మిగిలిన రెండు టెస్టుల్లో విజయాలు సాధించడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా రావాల్సిన అవసరం ఉంది.