తదుపరి వార్తా కథనం
IND vs NZ: ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 09, 2025
05:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచులో మొదట న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు.
టీమిండియా స్పిన్ దెబ్బకు న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరితమైంది.
Details
రాణించిన భారత బౌలర్లు
న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (63), బ్రేస్ వెల్ (53), రచిన్ రవీంద్ర(37) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలా ఓ వికెట్ తీశారు.
భారత జట్టు గెలవాలంటే 252 పరుగులు అవసరం