Nicholas Pooran: నికోలస్ పూరన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
గయానా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 40 పరుగులతో రాణించడంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. భారత జట్టు లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచులో విండీస్ బ్యాటర్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఫార్మాట్లో విండీస్ తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ క్రమంలో విండీస్ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్‌ను పూరన్ అధిగమించాడు.
టీ20ల్లో భారత్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్
నికోలస్ పూరన్ 78 టీ20ల్లో 26.03 సగటుతో 1,614 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక విండీస్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 1899 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మార్లోన్ శామ్యూల్స్ 1611 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. కేవలం 18 మ్యాచుల్లో 34.00 సగటుతో 544 పరుగులు చేసి ఆగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(500) నిలిచాడు. వరుసగా రెండు టీ20ల్లో చెలరేగిన నికోలస్ పూరన్ మూడో 20ల్లో మాత్రం త్వరగా పెవిలియానికి చేరాడు. దీంతో విండీస్ తక్కువ పరుగులు చేయగలిగింది.