Rishabh Pant: లక్నో కెప్టెన్సీ రేసులోకి నికోలస్ పూరన్.. రిషబ్ పంత్‌కు అవకాశం లేదా?
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర వెచ్చించి రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అతడు ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించగా, లక్నో అతడిని తమ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడానికి ఈ భారీ మొత్తం వెచ్చించినట్టు ఊహాగానాలు ఉన్నాయి. అయితే మరో స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌కు సారథ్య బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూరన్‌ను ఎల్‌ఎస్‌జీ రూ.21 కోట్లకు సొంతం చేసుకుంది, మరోవైపు పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్, తమ జట్టును పరిచయం చేసే వీడియోను షేర్ చేసింది. ఇందులో మొదట నికోలస్ పూరన్‌ను చూపించింది.
రైట్ టు మ్యాచ్ ద్వారా పంత్ ను తీసుకోవాలని అనుకున్నాం : దిల్లీ
ఆ వీడియోలో పూరన్, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, రిషబ్ పంత్ ఉన్నారు. దీంతో నికోలస్ పూరన్‌కు జట్టు పగ్గాలను చేపట్టే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు పంత్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశం కూడా ఉందని కొంతమంది అభిప్రాయపడ్డారు. దిల్లీ సహయజమాని పార్థ్ జిందాల్ స్పందిస్తూ, భారత క్రికెట్‌లో క్రికెటర్ సౌరభ్ గంగూలీ తర్వాత రిషభ్ పంత్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. రైట్ టు మ్యాచ్ ద్వారా పంత్‌ను తీసుకోవాలని అనుకున్నామని, కానీ, రూ.27 కోట్లకు వెళ్లడంతో తమ ప్రణాళికలు మారిపోయాయని చెప్పారు. తామే మొదటే పంత్‌కు అవకాశం ఇచ్చామని, కానీ అతడు దిల్లీతో ఉండకూడదని నిర్ణయించారని, ఆ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని వెల్లడించారు.