Nita Ambani: హార్ధిక్, బుమ్రా టాలెంట్‌ను రివీల్ చేసిన నీతా అంబానీ
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్ జట్టులో అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు గురించి రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఇటీవల బోస్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక విషయాలను పంచుకుంది.
ఐపీఎల్‌లో తమకు కచ్చితమైన బడ్జెట్ ఉంటుందని, ప్రతి జట్టు ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలని నీతా అంబానీ పేర్కొన్నారు.
టాలెంటెడ్ క్రికెటర్లను గుర్తించేందుకు తాము అనేక మార్గాలను అన్వేషిస్తామన్నారు.
దేశవాళీ మ్యాచ్‌లను చూసి,ప్రతిభ ఉన్న ఆటగాళ్ల గురించి తెలుసుకోవడం చాలా సులభమైందని పేర్కొంది. ఒక రోజు తమ బృందం ఇద్దరు యువ ఆటగాళ్లను ఎంపిక చేసి, వారిని క్యాంప్‌లో చేర్చిందన్నారు.
Details
భారత జట్టులో కీలక ప్లేయర్ గా తిలక్ వర్మ
అప్పటికి వారు బక్కపలచగా ఉండేవారని, వారికి ఆటలో ఉత్సాహం, అభిరుచిని గమనించి ప్రోత్సహించామన్నారు. ఇప్పుడు వారు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యా అని తెలిసిందన్నారు.
2015లో హర్ధిక్ పాండ్యాను తీసుకున్నామని, ఇప్పుడు అతడే తమ సారథి అని తెలిపారు.
ఆ తర్వాతి ఏడాదిలో తమ బృందం మరో యువ ఆటగాడిని ఎంపిక చేసి, అతడి బౌలింగ్ ప్రదర్శన చూసి ఆయనను క్యాంప్‌లో చేర్చిందన్నారు.
ఆ ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా అని, అతడి ప్రదర్శన ఇప్పటికీ గొప్పగా ఉందన్నారు.
ఈ ఏడాది తిలక్ వర్మను పరిచయం చేశామని, అతడు టీమ్ ఇండియాలో కీలకమైన ప్లేయర్‌గా ఎదుగుతున్నారని తెలిపింది.
ముంబయి ఇండియన్స్ భారత క్రికెట్ జట్టుకు ఒక నర్సరీగా మారిందని నీతా అంబానీ వెల్లడించారు.