Page Loader
Nitish Kumar Reddy: టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్
టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్

Nitish Kumar Reddy: టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీ సాయంతో 474 పరుగుల భారీ స్కోరు సాధించింది. మూడో రోజు ఆటలో భారత్‌కు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జంట మంచి ప్రారంభం అందించినా, పంత్ 28 పరుగుల వద్ద దూకుడు ప్రదర్శించే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. వెంటనే నాథన్ లియాన్ రవీంద్ర జడేజాను (17) అవుట్ చేయడంతో, భారత జట్టు దెబ్బతిన్నది. 7 వికెట్ల పతనంతో భారత జట్టు సంక్షోభంలో పడినా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కలిసి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు.

Details

టెస్టు క్రికెట్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ

తన టెస్ట్ కెరీర్‌లో నితీష్ రెడ్డి మొదటి అర్ధ సెంచరీ సాధించి, టీమిండియాను ఫాలో ఆన్ నుండి బయటపెట్టేందుకు కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం నితీష్ 69 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 34 పరుగులతో క్రీజులో నిలదొక్కుకుని ఉన్నారు. ఇంతలో, నితీష్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత పుష్ప చిత్రంలోని 'తగ్గేదేలే' స్టైల్‌లో సెలబ్రేట్ చేయడం అందరిని ఆకట్టుకుంది. బ్యాట్‌ను సింబాలిక్‌గా చూపిస్తూ తన దూకుడుతనాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పుష్ప స్టైల్ లో సెలబ్రేషన్స్